జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
పాఠశాల, కళాశాలల్లో చదివే పిల్లలకు ” స్నేహిత ” చక్కటి రక్షణ కవచమని జమ్మికుంట మండల విద్యాధికారి వి.శ్రీనివాస్ అన్నారు. ఈనాడు సమాజములో అఘాయిత్యాలు పెచ్చుమీరి పోతున్నాయని. వాటిని అరికట్టడం అందరి బాధ్యత అని. తొమ్మిది నెలల పిల్లల నుండి తొంభై యేండ్ల వయస్సు ఆడవారికి కూడా రక్షణ లేకుండా పోతుందని. అందుకు స్నేహిత అండగా ఉంట్టుందని ఈ కార్యక్రమ అధ్యక్షులు జిల్లా పరిషత్ బాలికల ప్రధానోపాధ్యాయులు డి. సుధాకర్ అన్నారు. సెప్టిటచ్చు, అన్సెప్టి టచ్చు విషయాల గురించి చైల్డ్ వెల్ఫేర్ అధికారిని రోహిణి విద్యార్థులకు వివరించారు. సమాజములో అనేక దురాఘాతాలు జరుగుతున్నాయని మీ ఉపాధ్యాయుల ద్వారా వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకొనీ వాటిని పాటించాలని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సదానందం తెలిపారు. ఏఈఓ లక్ష్మణ్ మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు విలువలు నేర్చుకొని చక్కగా జీవిస్తూ సమాజానికి ఉపయోగపడాలన్నారు. జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని రూపొందించి పాఠశాలల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉంటుందని. విద్యార్థుల్లో పోషకహర లోపం చాలా ఉంటుందని చక్కని పోషక ఆహారాన్ని తీసుకోవాలని వైద్యాధికారి తెలిపారు. మీకు ఏలాంటి ఇబ్బంది కలిగిన మాకు తెలియజేస్తే వాటిని గొప్యంగా ఉంచి పరిష్కరిస్తామని పోలీస్ అధికారి వివరించారు. ఈ కార్యక్రమములో వైద్యాధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, పలు శాఖల అధికారులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.