Crisis
ఆపదలో ఉన్న స్నేహితుని కుటుంబానికి చేయూతగా నిలిచిన మిత్రబృందం
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామంలో అక్టోబర్ 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో మంతెన శ్రీనివాస్ మరణించడంతో వారి బాల్య మిత్రులు 1991 టు 1992 బాయ్స్ హై స్కూల్ మిత్రులందరు శ్రీనివాస్ కు ప్రగాఢ సంతాపం తెలిపారు. మిత్రులు అందరూ కలిసి శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయలు శ్రీనివాస్ కుటుంబానికి శుక్రవారం అందజేశారు.కష్ట కాలంలో ఉన్న మిత్రుని కుటుంబాన్ని వారి వంతు సహాయంగా ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి కష్టాల్లో ఉన్న మిత్రుని కుటుంబాన్ని ఆదుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని మిత్రులందరికీ తెలియజేశారు ఇకముందు కూడా శ్రీనివాస్ కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్న మిత్రుల సహాయంతో సహాయ సహకారాలు అందిస్తామని వారి కుటుంబానికి భరోసా కల్పించారు.
