
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు వేషాలపల్లిలో నిరుపేద కుటుంబానికి చెందిన వేషాల రాజ్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా, మృతుడు రాజు క్లాస్ మెట్స్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 44 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మృతుని తోటి మిత్రులు దుండ్ర కుమారి యాదవ్, కుసుమ రామకృష్ణ, పేలేటి గోపాల్, ఆకుల కుమార్, పైతిరి దామోదర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు