వీణవంక,( కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రానికి చెందిన ఎస్ కే ఆరిఫ్, తండ్రి ఎస్ కే ఖాజామియా ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, ఎస్ కే ఆరిఫ్ తో పదో తరగతి చదివిన కొందరు స్నేహితులు కలసి మానత దృక్పథంతో సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ, 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అమృత ప్రభాకర్,ముద్దెర శ్రీనివాస్, దాసరపు అంకుస్, ఐలవేణి రామన్న, కర్ర కోమల్ రెడ్డి, రెడ్డి రాజుల రవీందర్, చిందం శ్రీనివాస్, గిరవేన రవీందర్, మిట్టపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.