ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విజేతలకు బహుమతులు అందజేత
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రంలో ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ గత కొద్దిరోజులుగా నిర్వహించడం జరిగింది ఫైనల్ మ్యాచ్లో జరా సంఘం వర్సెస్ దిగ్వాల్ క్రికెట్ జట్లు పాల్గొనడం జరిగింది. మన రన్నర్ గా జరా సంఘం విజేతగా నిలవడం తో సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాటిల్ ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ మరియు యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి అధ్యక్షులు నరేష్ గౌడ్ మాజీ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ బొప్పాన్ పల్లి సర్పంచ్ అమృత్ కొల్లూరు సర్పంచ్ శివరాజ్ మాజీ సర్పంచులు కాంగ్రెస్ నాయకులు యువ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.
