చిట్యాల, నేటిధాత్రి :
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన బొట్ల రమేష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు చిట్యాల మండల కేంద్రంలో స్థానిక జిల్లా ప్రజాపరిషత్ సెకండరీ పాఠశాలలో అతనితో పాటు చదువుకున్న 2008 బ్యాచ్ కి చెందిన పదవ తరగతి మిత్ర బృందం, తమ వంతు సహాయంగా 38200/- రూపాయల ఆర్థిక సహాయాన్ని రమేష్ కుటుంబసభ్యులకు అందజేయడం జరిగింది. అదేవిదంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో శంకర్ రఘుపతి ఓంకార్ కర్ణాకర్ నరేష్ చంద్రమౌళి సురేష్ కిరణ్ శ్రీకాంత్ కార్తీక్ సాగర్ రాజేష్ నవీన్ అశోక్ ప్రవీణ్ రాజు తదితరులు పాల్గొన్నారు