పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక బస్టాండ్ లో మంచి నీటి సౌకర్యాన్ని ఏర్పాటుచేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.హన్మకొండ, భూపాలపల్లి,చిట్యాల,హుజురాబాద్ లకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి పరకాల బస్టాండ్ జన సమూహంతో రాకపోకలతో అనునిత్యం కితకిటలాడుతుంది.మేడారం,వేములవాడ,కొండగట్టు జాతరలకు వెళ్లే ప్రయాణికులు తాగడానికి నీళ్లు ఏర్పాటుచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.రాబోయే మేడారం జాతరను,వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు,ప్రయాణికులకు బస్టాండ్ లో మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని అధికారులను కోరడం జరిగింది.