మల్లాపూర్ మార్చి 20 నేటి దాత్రి
మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మల్లాపూర్ వారి అధ్వర్యంలో ఉచితంగా పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆవులు, గేదెలకు చూడి పరీక్షలు, గర్భకోశ వ్యాధి చికిత్సలు మరియు దూడలకు నట్టల నివారణ మందులు పంపిణి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్శింగరావు హాజరై రైతులకు ఇలాంటి వైద్య శిబిరాన్ని ఉపయోగిచుకోవాలనీ తేలిపారు. ఈ కార్యక్రమము లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడ్పుల పుష్పలత, ఉపద్యక్చులు ఎత్తడి నారాయణ రెడ్డి, ముత్యంపేట పశువైద్యాధికారి డాక్టర్ జి. అశోక్, కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సురేష్, డాక్టర్ డి.వెంకటేష్, డాక్టర్ జె.వెంకటేష్ మరియు కళాశాల విద్యార్థులు పశువైద్య సిబ్బంది ఇక్బల్,అచ్చె శ్రీనివాస్ తైసిన్ రవీందర్,రవి, సాయన్న, గ్రామస్తులు మరియు పాడిరైతులు తదితరులు పాల్గొన్నారు.
ఉచితంగా పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు..
