ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటి ధాత్రి:
ఓదెల మండలం పిట్టలేల్లయ్యపల్లి గ్రామం లో తెలంగాణ రాష్ట్ర పశుగణావద్ధి సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఉచిత గర్భాకోశ వ్యాధులకు చికిత్స శిబిరం మరియు చూడి పరీక్షలు దూడలలో నట్టల నివారణ మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.కరీంనగర్ అభివృద్ధి సంస్థ సూపర్ వైజర్ మాట్లాడుతూ కృత్రిమ గర్భధారణ ద్వారా మేలు జాతి పాడి పశువుల సంతదిని వృద్ధి చేసుకోగలరని సూచించారు.గతంలో పశువుల కు కృతిమ గర్భధారణ చేసిన సమయం లో ఆడ లేక మగ దూడ జన్మించేవని గుర్తు చేశారు.ఇప్పుడు కృత్రిమ గర్భధారణ చేయడం ద్వారా ఆడ దూడలు మాత్రమే జన్మిస్తాయని స్పష్టంచేశారు.ఈ వీర్యం నికి మార్కెట్ రేట్ 600రూ|| ఉండగా సబ్సిడీ పై 250రూ|| అందిస్తున్నామని వారు తెలిపారు.ఈ అవకాశాన్ని రైతులు వినియోగించు కావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో 40 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్స లు,25 దూడలకు నట్టల నివారణ మందులు తాగించారు, 4 కృత్రిమ గర్భధారణ చేసి మంధుల పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి డాక్టర్ కుమారస్వామి గోపాల మిత్రులు ఉమామహేశ్ ఓదేలు, పాడి రైతులు పాల్గొన్నారు