వృద్ధులకు, వికలాంగులకు ఉచిత వ్యాన్ సేవ

గొల్లపల్లి నేటి ధాత్రి:

పేరుకు కోటీశ్వరులైన.. సహాయం చేసే స్తోమత కలిగిన వారైనా.. కనీసం రూపాయి కూడా సహాయం చేయడానికి చాలామంది జంకుతూ ఉంటారు. అలాంటి వారికి కనువిప్పు కలిగేలా చేస్తున్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో బాదినేని మల్లారెడ్డి సేవా దృక్పథంతో లక్ష్మీపూర్ మరియు పరిసర ప్రాంత వృద్ధులకు, వికలాంగులకు మరియు గర్భిణీ స్త్రీల ఆరోగ్య అవసరాల నిమిత్తం హాస్పిటల్ కు వెళ్లడానికి లక్ష్మీపూర్ నుండి జగిత్యాలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోవిందుల లావణ్య జలపతి, కట్ట శివ, మల్లారెడ్డి, రాజిరెడ్డి, ఆశినేని లక్ష్మణ్, బలిజపల్లి శంకరయ్య, తిరుపతి, మందపల్లి లక్ష్మణ్, ఎనగందుల మల్లయ్య, లచ్చన్న, రంగ మల్లేశం, సతీష్, శేఖర్ గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!