నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ, ఉపాధి మేళా
నడికూడ,నేటిధాత్రి:
తేదీ. 03/07/2025. గురువారం రోజున ఉదయం 10 గంటలకి నడికూడ మండల ప్రజా పరిషత్ నడికూడ కార్యాలయంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి మేళ నడికూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గజ్జెల విమల ఆధ్వర్యంలో మేళా నిర్వహించబడును.ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలోని పేద నిరుద్యోగ యువతీ యువకులకు కంప్యూటర్,స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్స్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు లాజిస్టిక్స్ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇచ్చి శిక్షణానంతరము ప్రముఖ కార్పొరేట్ కంపెనీల యందు ఉద్యోగ అవకాశం కల్పించబడును శిక్షణ కాలంలో ఉచిత భోజనము మరియు వసతి యూనిఫామ్స్ స్కాలర్షిప్ మరియు కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్ర ప్రభుత్వం చే ఎంప్లాయిమెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ సర్టిఫికెట్ ఇవ్వబడును.ఈ అవకాశాన్ని నడికూడ మండలంలోని అన్ని గ్రామాల నుండి
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ యొక్క విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు మరియు రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ తీసుకొని తేదీ.03/07/2025. రోజున గురువారం ఉదయం 10 గంటలకి నడికూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి హాజరు కాగలరని ఎంపీడీవో గజ్జెల విమల తెలిపారు. పూర్తి వివరణ కోసం 9849131050,9642141539. సంప్రదించగలరు.