శ్రీశైలంలో నేటి నుంచి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభం
జహీరాబాద్ నేటి ధాత్రి:
శ్రీశైలం మహా క్షేత్రంలో ఈరోజు నుండి గతంలో నిలిపివేసిన ఉచిత స్పర్శ దర్శనాన్ని పునః ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఈ ఉచిత దర్శనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉచిత దర్శనం గురించి భక్తులకు తెలిసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు ఈవో ఎం శ్రీనివాసరావు. మై కానౌన్స్మెంట్ ద్వారా అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భక్తులు ఉచిత దర్శనానికి ఎలా వెళ్లాలి టికెట్స్ ఎలా పొందాలనే విషయాన్ని పొందుపరిచారు. మధ్యాహ్నం ఒకటి 15 నిమిషాలకు టోకెన్లు జారీ చేసి ఒకటి 45 నుంచి 3:45 వరకు ఈ ఉచిత స్పర్శ దర్శనాన్ని కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు. భక్తుల రద్దని బట్టి 1000 నుంచి 1200 మందికి ఈ ఉచిత స్పర్శ దర్శనం కల్పించే అవకాశం ఉందని వారంలో నాలుగు రోజులు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయం ఈ ఉచిత స్పర్శ దర్శనానికి కేటాయించామని ఈవో తెలిపారు.