మర్రిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు,యూనిఫాం పంపిణి.

చందుర్తి, నేటిధాత్రి:

వేసవి సెలవుల అనంతరం నూతన విద్యా సంవత్సరం పునఃప్రారంభం సందర్భంగా మర్రిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు , యునిఫాం ను ఎంపిటిసి దారం కావ్య బాల్ రెడ్డి చేతుల మీదుగా పంపిణి చేశారు, అనంతరం ఎంపిటిసి మాట్లాడుతూ…
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు ఉన్నాయని, అన్ని అర్హతలు , అనుభవం కలిగిన ఉపాద్యాయుల విద్యా బోధన, కంప్యూటర్ విద్యతో, పాటు డిజిటల్ రూపంలో విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులోనికి వచ్చిందని, ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరి, నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు వినయ్ కుమార్, దారం బాల్ రెడ్డి,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటి చైర్ పర్సన్ బైరగోని అనిత , ఉపాద్యాయులు గంగనర్సయ్య, సావిత్రి, వేణు, రవి, మేడికాల అంజయ్య
విద్యార్థులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!