Free Tailoring Training for Women
మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ
#నెక్కొండ, నేటి ధాత్రి :
స్వయం ఉపాధికి అవకాశం
మహిళల స్వయం ఉపాధి సాధికారతే లక్ష్యంగా ఉచిత కుట్టు (టైలరింగ్) శిక్షణ కార్యక్రమంను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులలొ ఒకరైన కిషోర్ తెలిపారు. కుట్టుపనిపై ఆసక్తి ఉన్న మహిళలకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
ఈ శిక్షణకు 19 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల మహిళలు అర్హులు. శిక్షణ కాలంలో
శిక్షణ, భోజనం, వసతి పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఎస్బిఐ ఆర్ఎస్ ఈటిఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు భవిష్యత్తులో స్వయం ఉపాధి అవకాశాలు పొందేందుకు ఇది దోహదపడనుందని పేర్కొన్నారు.
ఆసక్తి గల మహిళలు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
97040 56522, 98493 07873 నంబర్లను సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ: 05-01-2026
మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడే ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని నెక్కొండ ప్రాంత ప్రజలను కోరుతున్నారు.
