చెన్నూర్ నేటి ధాత్రి:
స్థానిక చెన్నూర్ పట్టణం లోని అయ్యప్ప స్వామి టెంపుల్ లో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం ఉదయం గం: 9 నుంచి మధ్యాహ్నం గం.12 వరకు కొనసాగింది.రేకుర్తి కంటి ఆసుపత్రి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గర్మిల్ల సంయుక్తంగా నిర్వహించారు.చెన్నూర్,కోటపల్లి వేమనపల్లి ప్రజలు భారీగా శిబిరానికి తరలివచ్చారు.పట్టణ నిర్వాహకులు కౌన్సిలర్ జడి సురేఖ తిరుపతి ,రిటైర్డ్ టీచర్ రాములు సార్ మరియు వారి మిత్ర బృందం నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.వారు మాట్లాడుతూ నేత్ర పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ అవసరం ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్ చేసి పేషంట్ కి మరియు అటెండర్ కి ఉచిత రవాణా సౌకర్యాలు కల్పిస్తాం అని తెలిపారు.