
Free Mega Medical Camp in Parakala Today
నేడే పరకాలలో ఉచిత మెగా వైద్య శిబిరం
ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి
మేకల చంద్రమోహన్ స్వేరో కార్డియాలజిస్ట్
పరకాల నేటిధాత్రి
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో ఆలోచన విధానంతో మరియు స్వేరోస్ నెట్వర్క్,మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం రోజున స్థానిక స్వర్ణ గార్డెన్ లో ఉదయం 10 గంటలనుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ మేకల చంద్రమోహన్ స్వేరో కార్డియాలజిస్ట్ మరియు డాక్టర్ మౌనిక స్వేరో లు తెలిపారు.ఈ వైద్య శిబిరంలో డాక్టర్ మామిడి తిరుపతి పీడియాట్రిషన్,డాక్టర్ గణేష్ మెడికల్ గ్యాస్ట్రిక్,డాక్టర్ నిహారిక ఆన్కాలేజి,డాక్టర్ మమత న్యూరాలజీ,డాక్టర్ దివ్య గైనకాలజీ,డాక్టర్ కళ్యాణి జనరల్ మెడిసిన్ గల వైద్యులు అందుబాటులో ఉంటారని శిబిరం వద్దనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు షుగర్ మరియు బీపీ పరీక్షలు 2డి ఇచో స్కాన్ నిర్వహించి ఉచిత మాత్రలు అందజేస్తారని,పేబ్యాక్ ద సొసైటీ అనే నినాదంతో తన జన్మస్థలమైన ప్రాంతంలోని నిరుపేద కుటుంబాలకు సేవచేయాలనే ఆలోచనతో ఈ వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.ఈ వైద్య శిబిరానికి పరకాల,నడికూడ మరియు పరిసర ప్రాంత ప్రజలు హాజరై ఉపయోగించుకోవాలని కోరారు.