వనపర్తి నేటిధాత్రి ;
వనపర్తి పట్టణంలో పాతకోట ఇటుకూరి వెంకటయ్య రేషన్ డీలర్ షాప్ పక్కన శివాలయంలో ప్రతి నెల పున్నమి అమావాస్య రోజున ఉచిత ధ్యానం ఉంటుందని అనంతరం అన్నదానం ఉంటుందని ధ్యాన కేంద్రం నిర్వాహకులు కమలమ్మ ఈశ్వరమ్మ జైపాల్ రెడ్డి ఆకుతోట లక్ష్మీనారాయణ బిజెపి కిసాన్ మోర్చా నాయకులు ఏర్పుల జ్ఞానేశ్వర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల శక్తి పెరుగుతుందని బిపి షుగర్ ఇతర జబ్బులు రాకుండా కాపాడుతుందని వారి పేర్కొన్నారు. ప్రధాని మోది ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్య యోగి ప్రతిరోజు ధ్యానం చేస్తారని వారు గుర్తు చేశారు . ధ్యానం చేసే సమయంలో శ్వాస మీద ధ్యాస పెట్టాలని వారు అన్నారు . వనపర్తి లో ధ్యానం చేయాలనుకునేవారు ప్రతిరోజు శివాలయంలో ఉచిత ధ్యాన కేంద్రానికి రావచ్చని అందులో పిరమిడ్స్ ఉంటాయని వాటి కింద కూర్చొని ధ్యానం చేస్తే మనసు ప్రశాంతత ఏకాగ్రత ఉంటుందని వారు పేర్కొన్నారు. ధ్యానం చేస్తే ఏ సమస్య వచ్చినా తొలగిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని వారు పేర్కొన్నారు . ప్రతిరోజు ధ్యానం చేయడానికి వీలును బట్టి ఒక గంట గాని రెండు గంటలు గాని ధ్యానానికి కేటాయించాలని వారు ప్రజలను కోరారు .