
మల్లక్కపేటలో ఉచిత వైద్య శిభిరం
పరకాల నేటిధాత్రి
మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ)ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరాన్ని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు ఐఎంఎ స్టేట్ కౌన్సిల్ మెంబర్,ఎంజీఎం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్.దొమ్మటి ప్రసన్న కుమార్ తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరువుతున్నట్టు తెలిపారు.గ్రామంలో ఆదివారం రోజున ఉదయం 9గంటలనుండి సాయంత్రం 3గంటలవరకు అనస్తిషియా,గుండె నిపుణులు,కిడ్నీ వైద్య నిపుణులు,స్త్రీల వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని అగర్వాల్ కంటి ఆసుపత్రి వారు ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నారని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు