— పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరం,
నిజాంపేట, నేటిధాత్రి
గ్రామీణ ప్రాంత నిరుపేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఐఆర్ సిఎస్ లయన్ డా,, ఏలేటి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజున మండల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ, వీఎస్టి పరిశ్రమ తూప్రాన్ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీపీ, షుగర్ పరీక్షలు, కంటి, చెవి ముక్కు, గొంతు, వరిబీజము, బీజకుట్టు గడ్డలు, థైరాయిడ్ గడ్డలు, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలపై మల్లారెడ్డి హాస్పిటల్ (సూరారం) వైద్యులచే ఉదయం 9:30 నుండి చికిత్సలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు