
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి వైద్య శిబిరం నిర్వహించామని అవసరం ఉన్నవారికి ఉచితంగా శ్రీ సత్య సాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదులో శంకర్ హాస్పిటల్ లో ఉచిత కంటి ఆపరేషన్లు వసతి భోజనం రవాణ ఏర్పాటు చేశామని శ్రీ సత్యసాయి సేవా సంస్థ జిల్లా కన్వినర్ పుల్లయ్య శెట్టీ వనపర్తి పట్టణ కన్వీనర్ రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు కంటివైద్య శిబిరం డాక్టర్ పొదిలి శ్రీధర్ శంకర్ హాస్పిటల్ డాక్టర్ రీషాద్ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించామని రమేష్ రెడ్డి తెలిపారు . దాదాపు 160 మంది వనపర్తి వివిధ గ్రామల ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారని అవసరం ఉన్నవారికి సంస్థ తరఫున ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు .కంటి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన ప్రజలకు పాండురంగయ్య రాఘవేంద్ర బ్రహ్మయ్య చారి వీరాచారి వెంకటాచలం సేవలు అందించారు