
Free medical camp
పరకాల కోర్టులో ఉచిత వైద్య శిభిరం
ఉచిత పరీక్షలు చేసిన వైద్య సిబ్బంది
పరకాల నేటిధాత్రి
పరకాల మండల న్యాయ సేవధికారి సంస్థ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ వరంగల్ వారి సహకారంతో పరకాల కోర్టు ప్రాంగాణంలో ఉచిత వైద్యశిబిరాన్ని బుధవారం రోజున ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో కార్డియాలాజిస్ట్ డాక్టర్.షఫీ,ఆర్థోపెడిక్ డాక్టర్.నవీన్ లు మరియు వైద్య సిబ్బంది పాల్గొని ఉచిత పరీక్షలు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జూనియర్ సివిల్ జడ్జ్ సాయి శరత్ ఈ సందర్బంగా మాట్లాడుతూ న్యాయవాదులందరు వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు.డాక్టర్ లు మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యవిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని,రోజులు ఉదయాన్నే వ్యాయామంతో పాటు ఆహరపు అలవాట్లను కూడా మార్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి.భద్రయ్య,ఏజీపి మెరుగు శ్రీనివాస్,ఏపిపిఎస్ రుదిర,కుమార్,ఒంటేరు రాజమౌళి,న్యాయవాదులు,కోర్టు సిబ్బంది,పోలీస్ సిబ్బంది,కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.