
మొగుళ్ళపల్లి ,నేటిదాత్రి న్యూస్ అక్టోబర్ 25
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని గణేష్ పల్లిలో మొగుళ్ళపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి ఆదేశాల మేరకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి స్థానిక సర్పంచ్ తిప్పారపు యుగేందర్ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, డయేరియా, వైరల్ ఫీవర్ లాంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, డాక్టర్ల సూచనలను పాటించాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, వేడివేడి ఆహార పదార్థాలను మాత్రమే తినాలని ప్రజలకు సూచించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన 48 మందికి వైద్య పరీక్షలు చేయగా ఇద్దరు జ్వర పీడితులను గుర్తించి రక్త నమూనాలను సేకరించడం జరిగిందని డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. అనంతరం గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బందితో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటస్వామి, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, పంచాయతీ సెక్రెటరీ మమత, ఆశాలు మాధవి, సునీత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.