సర్వేంద్రియానా నయనం ప్రధానం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం సూర్య నాయక్ తండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో మరియు లయన్ విజన్స్ క్లబ్ చేతులమీదుగా ఉదయము 7 గంటల 30 నిమిషాల నుండీ ఉచిత కంటి పరీక్షలకు అన్నిగ్రామాల ప్రజలు పాల్గొన్నారు ఈ పరీక్షలకు పెద్ద ఎత్తున వచ్చి వారికి ఉన్నటువంటి కంటి సమస్యలు చూపించుకున్నారు అవసరమైన కొంతమందికి ఆపరేషన్లు చేయించుకుంటా మన్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించినందుకు ప్రజలు ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు ఈ స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షులు మాదం రజిని కుమార్ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మరియు అన్ని మండలాల అధ్యక్షులతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా త్వరలో అన్ని మండలాల్లో చేస్తాము. ఈరోజు ఈకార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించిన తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షుడు తీన్మార్ జయ్ దీనికి పూర్తి సహకారం అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమం లో గ్రామంలోని ప్రజలు పాల్గొన్నారు