-ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి
-రోహిణి వైద్యుడు డాక్టర్ రమణారెడ్డి
#నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రోహిణి హాస్పిటల్ ప్రైవేటు వైద్యశాలలో శనివారం రోజున ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రముఖ రోహిణి వైద్యుడు డాక్టర్ రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యుడు రమణారెడ్డి మాట్లాడుతూ మానవ శరీరంలో అత్యంత సునీతమైన భాగం నేత్రాలని ప్రతి ఒక్కరు కూడా నేత్ర పరీక్షలను శనివారం రోజున ప్రముఖ వైద్యులు శరత్ మాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ పర్యవేక్షణలో ఉచిత కంటి పరీక్షలను నిర్వహిస్తున్నామని కావున మండలంలోని ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రోహిణి హాస్పిటల్ సిబ్బంది రవి, సుధాకర్ రెడ్డి, ఝాన్సీ మెడికల్ షాప్ యజమాని చల్ల లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు