*గృహ జ్యోతి పథకం ద్వారా పేద ప్రజలకు తగిన ఆర్థిక భారం. గృహ జ్యోతి పథకంతో పేదల కుటుంబాల్లో వెలుగులు*
*-మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు*
మొగుళ్ళపల్లి నేటి దాత్రి
గృహ జ్యోతి పథకంతో పేదల కుటుంబాల్లో వెలుగులు నిండాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు అన్నారు. మంగళవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గృహజ్యోతి లబ్ధిదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ..గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు విద్యుత్ ను ఉచితంగా అందజేస్తున్న కరపత్రాన్ని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా గృహ జ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు లబ్ధిదారుల కుటుంబాలకు సంక్రాంతి శుభాకాంక్షలను తెలపడం జరుగుతుందన్నారు.

లబ్ధిదారులు వాడిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లించడం జరిగిందన్నారు. విద్యుత్ బిల్లుల కోసం ఖర్చు చేసే డబ్బులను పిల్లల చదువు, ఆరోగ్యం మరియు కుటుంబాల అవసరాలకు ఉపయోగించుకోవచ్చన్నారు. రాష్ట్రంలోని 52, 82,498 కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లుల ద్వారా లబ్ధి పొందుతున్నాయని, ఈ పథకం ప్రారంభం నుండి నేటి వరకు ప్రజలు చెల్లించాల్సిన సుమారు రూ. 3,593 కోట్ల రూపాయలను ప్రభుత్వం పూర్తిగా భరించి లబ్ధిదారుల పక్షాన విద్యుత్ సంస్థలకు చెల్లించిందన్నారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సంక్రాంతి పండుగను మీ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు-కోటేశ్వర్ రావు దంపతులు, విద్యుత్ శాఖ అధికారులు ఫోర్ మెన్ యాదగిరి, ఏఎల్ఎం రమేష్, అన్ మ్యాన్డ్ వేముల కిరణ్ గౌడ్, గృహ జ్యోతి లబ్ధిదారులు పాల్గొన్నారు.
