జిఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం.

త్వరలో జిఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో సిహెచ్ సి లో మధ్యాహ్న భోజనం ప్రారంభం.

నిరుపేదలకు జిఎంఆర్ఎం ట్రస్ట్ ఎప్పుడు అండగా ఉంటుంది.

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.

 

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం జూకల్ గ్రామంలోని బీఎన్ ఆర్ ఫంక్షన్ హల్ లో జిఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో చిట్యాల మండల యువతి యువకులకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ మరియు అర్హులకు లైసెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భూపాలపల్లి శాసన సభ్యులు శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు,వరంగల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి గారు, జిఎంఆర్ఎం ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ శ్రీ గండ్ర గౌతమ్ రెడ్డి పాల్గొనడం జరిగింది అనంతరంజ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.గండ్ర గౌతమ్ రెడ్డి గారు మాట్లాడుతూ. జిఎంఆర్ ట్రస్ట్ ద్వారా దాదాపు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ఉచిత డ్రైవింగ్ శిక్షణ తరగతులు అందించడం జరిగింది. అనిఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు,చివరి గ్రామం వరకు డ్రైవింగ్ తరగతులు మరియు అర్హులకు లైసెన్స్ లు అందిస్తాము.అని
నిరుపేద కుటుంబ సభ్యులకు జిఎంఆర్ ట్రస్ట్ ఎప్పుడు అండగా ఉంటుంది. అన్నారుగండ్ర జ్యోతి మాట్లాడుతూ…ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారి తండ్రి గారు కి శే గండ్ర మోహన్ రెడ్డి మొదటినుంచి సమాజ సేవ దృక్పథంతో నడిచిన గొప్పవ్యక్తి.మొదటగా భూపాలపల్లి మండలంలో ప్రారంభించుకుని ఎంతో దిగ్విజయంగా చిట్యాల వరకు సాగిన జిఎం ఆర్ఎం ప్రయాణం.ప్రతి యువకుడికి లైసెన్స్ ఇవ్వాలన్న, డ్రైవింగ్ నేర్పించాలని చూసిన ట్రస్ట్ వెనుక చాలా కష్టం ఉన్న యువత భవిత కోసం ముందుకు సాగుతున్నాం. అని జిఎంఆర్ఎం ట్రస్ట్ సేవ కార్యక్రమాలపై దుష్ప్రచారం చేస్తున్నారు.మేము మంచి సంకల్పంతో ముందుకు వెళుతున్నాం తప్పా ఎటు వంటి రాజకీయ దురుద్దేశ్యం లేదుమీ మీ ఊర్లల్లో చర్చలు పెట్టాలి.మంచి చేసే వారు ఎవరు,ముంచే వారు ఎవరు ఆలోచించాలి.బి ఆర్ ఎస్ పార్టీలోకి వచ్చిన నాటి నుంచి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ,అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.
బి ఆర్ ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది కాబట్టి ప్రజలను ఓటు అడిగి హక్కు ఉంది.
గ్యారంటీ ల పేరుతో వస్తున్న పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పాలి.వారు ఇచ్చే గ్యారంటీ ఒక్కటే ప్రతి6నెలలకు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా వాళ్ళ పార్టీలో బరిలో ఉంటారు.యువతి యువకులు ఈ ఉచిత డ్రైవింగ్ శిక్షణ సదుపాయాన్నీ సద్వినియోగం చేసుకోవాలన్నారు.మన ట్రస్ట్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన దమ్మన్నపేట గ్రామ యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ప్రభుత్వ పరమైన సహాయక చర్యలు అందాయి.మీ సేవ చేయడం కోసం ఎల్లప్పుడూ మేము అండగా ఉంటాం. అన్నారుఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ…రవాణా వ్యవస్థలో ,ప్రజాస్వామ్యం వచ్చిన భారత దేశంలో చాలా మార్పులు జరిగాయి.మారుతున్న అవసరాలకు అనుగుణంగా మానవ మనుగడ ముందుకు సాగుతున్నాం.చాలా చోట్ల నుంచి చాలా ఫోన్ లు వస్తున్నాయి, మాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు అని చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చిన తరుణం.ఇలాంటి పరిస్థితులకు స్వస్థి పలకాలని మా తండ్రి గారి పేరుమీద స్థాపించిన జిఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా డ్రైవింగ్ తరగతులను ప్రారంభీంచాలని నిర్ణయం తీసుకున్నాం.డ్రైవింగ్ నేర్పించడం తో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి లైసెన్స్ లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.
యువతి,యువకులకు ఉపాధి కల్పించాలని,వారి జీవితంలో ఒక స్వలంభన కల్పించాలని నేను ముందుకు రావడం జరిగింది.మన భూపాలపల్లి జిల్లాలో తొలుత ఆర్టీవో కార్యాలయంలో ప్రతి రోజు 30 స్లోట్స్ ఉంటే ఇప్పుడు వాటిని రోజుకు 60 వరకు పెంచడం జరిగింది.
. జి ఎం ఆర్ ఎం ట్రస్ట్ ఒక్క డ్రైవింగ్ తరగతులే కాకుండా యువతలో ఉన్న నైపుణ్యం కలిగిన వారికి ఉచితంగా క్రీడలని నిర్వహించడం జరిగింది.ఉత్తమ ప్రతిభ కనబర్చిన యువతకు బహుమతులను కూడా జిఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా అందించడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించిన క్రమంలో కార్పొరేట్ స్థాయికి తగ్గట్టుగా,నాణ్యమైన విద్య మరియు భోజన సదుపాయాలతో కోచింగ్ అందించాము.గడిచిన 16నెలల నుంచి జిఎంఆర్ఎం ఆధ్వర్యంలో భూపాలపల్లి ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం.రానున్న 2లేదా 3 రోజుల్లో జిఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా చిట్యాల సిహెచ్సి దవాఖానలో కూడా మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే…

సామాజిక సేవ కార్యాక్రమాలతో పాటు ప్రభుత్వ పరమైన పథకాలను ప్రజల్లోకి అమలు చేస్తూ, అభివృద్ధి పనుల కోసం గౌ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నిధులు మంజూరు చేస్తూ అభివృద్దే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గొర్రె సాగరు ఎంపీపీ దావ వినోద టిఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, యువతి యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!