చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని యువతి యువకులకు ఈ నెల 21 న చిట్యాల మండలములోని యువతీ యువకులకు జిఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో లో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా ని నిర్వహించడం జరుగుతుంది అని జిఎంఆర్ఎం ట్రస్ట్ జనరల్ సెక్రటరీ గండ్ర గౌతమ్ రెడ్డి తెలిపారు. ఆయన మండల కేంద్రము లో విలేకరులతో మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గం లో ప్రతి మండలంలో యువతీ యువకులకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. అందులో భాగంగా చిట్యాల మండలంలోని యువతీ యువకుల కోసం
ఈ నెల 21 న మండలం లోని జూకల్ లో గల బి ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఉదయం 9 గంటలకు లైసెన్స్ లేని 18 సంవత్సరాలనుండి 40 సంవత్సరాల లోపు వారు తమ ఆధార్, ఫోటో, డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్స్ తో రావాలని కోరారు. ఒక రోజు మాత్రమే అప్లికేషన్స్ తీసుకున్నాక ప్రతి గ్రామంలో డ్రైవింగ్ నేర్పించడం జరుగుతుంది అని అన్నారు. ఈ గొప్ప అవకాశం ని మండలం లోని వారు సద్వినియోగం చేసుకోవాలి అని ముఖ్య అతిధి గా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి హాజరు అవుతారు అని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ 8008387496,9000094717, 77024 55175 నంబర్స్ ని సంప్రదించాలని కోరారు