కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి:
కేసముద్రం మండలంలోని దన్నసరి గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మరియు పశు సంవర్డక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కొండేటి శ్రీవాణి రవీందర్ రెడ్డి ప్రారంభించగా ముఖ్య అతిథులుగా స్థానిక పశువైద్య అధికారి డాక్టర్ విజయ్ కుమార్ పాల్గొని పాడి రైతులకు పశుగ్రాసాల పెంపకం,దూడల పెంపకం,లింగ నిర్దారణ వీర్యం ఎద లక్షణాలు గురించి రైతులకు వివరించారు.67 పాడి పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్సలు చేసి ఉచితముగా మందులు పంపిణీ చేయడం జరిగింది.అలాగే పశువులకు నట్టల నివారణ మందులు వేశారు.ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర సూపర్వైజర్ కె.రఘువీర్ గోపాలమిత్రలు ఎస్కే సుభాని,సుధాకర్,పశు వైద్య సిబ్బంది గ్రామస్తులు పాడి రైతులు పాల్గొన్నారు.