ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :

దుగ్గొండి మండలంలోని రేకంపల్లి గ్రామంలో పశు సంవర్ధక శాఖ, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని పశువైద్యాధికారులు దుగ్గొండి విఏఎస్ పివిసి డాక్టర్ రామ్మోహన్,
తిమ్మంపేట పివిసి డాక్టర్ బాలాజీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా 78 పాడి పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్సలు చేసి పశువులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.అలాగే నట్టల నివారణ మందులు పంపిణీ చేసి 2 పశువులకు కృత్రిమ గర్భధారణ చికిత్సలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర సూపర్వైజర్ ఇరుకు దేవేందర్ రావు,విజయ డైరీ ఇన్చార్జి మేనేజర్ ఎండి జహంగీర్, రాజ్ కుమార్ ,గోపాలమిత్రులు సిహెచ్ ప్రసాద్,కుమారస్వామి, బి లక్ష్మీనారాయణ,అక్బర్, ప్రసాద్,గ్రామస్తులు పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!