హైదరాబాద్, నేటి ధాత్రి:
అక్షిత ఫౌండేషన్ చైర్మన్ సన్నీ కుమార్ రాపాక ఒక సందర్భంలో మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ విధానాన్ని రద్దు చేయాలని, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, మిగిలిన వారికి టికెట్ ధరలలో 50 శాతం తగ్గించి బస్సులు నడపాలని కోరారు. పరిపూర్ణత లేని ఉచిత హామీలు ప్రజాస్వామ్య మనుగడకు ముప్పుగా మారుతాయని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కల్పించే అవకాశం ఉందని, సమాజంలో సమానత్వ భావన కనుమరుగైపోయే సందర్భం కనిపిస్తుందని, ప్రజాధనాన్ని ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రజలందరికీ అందించటంలో ఉపయోగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అక్షిత ఫౌండేషన్ చైర్మన్ సన్నీ కుమార్ రాపాక, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.