
Free FMD Vaccination for Village Cattle Begins
పాడి పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి టీకాలు
* నెలరోజుల పాటు ఉచిత టీకాలు
* పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి
* వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రాజబాబు
మహాదేవపూర్ అక్టోబర్ 15 (నేటి ధాత్రి)
జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా పాడి పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి టీకాల కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రాజబాబు ఒక ప్రకటనలో బుధవారం రోజున తెలిపారు. మండల పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికొంటువ్యాధి టీకా కార్యక్రమం అక్టోబర్ 15 నుండి నవంబర్ 14 రోజుల వరకు అనగా నెల రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇది జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా అమలవుతుందని దీనిని మండలంలోని పాడి రైతులు అందరూ సద్వినియోగ పరచుకోవాలని కోరారు. మండలం మొత్తం మీద మూడు టీంలు ఏర్పాటు చేసి వ్యాధి నివారణ టీకాలు గ్రామాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. గాలికుంటు వ్యాధి చాలా వేగంగా వ్యాపించే వైరస్ వ్యాధి అని ఈ వ్యాధి సోకిన పశువులకు పాల ఉత్పత్తి, సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిస్తుందని అంతేకాక రైతులకు ఆర్థిక నష్టాన్ని మిగులుస్తుందని తెలుపుతూ మండలంలోని ప్రతి పాడే రైతు ఆరు నెలలకు టీకా వేయించడం ద్వారా తిని నివారించవచ్చని అన్నారు. ప్రతి పాడి రైతు తన పశువులకు టీకా వేయించి పషా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఇది ఎఫ్ఎండి టీకా ఉచితం సురక్షితం మరియు శాశ్వత నివారణ మార్గం అని డాక్టర్ రాజబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా జిల్లా లైబ్రరీ చైర్మన్ కోట రాజబాబు, సింగల్ విండో చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి, పశు వైద్య కేంద్ర సిబ్బంది, పాడి రైతులు, ప్రజలు పాల్గొన్నారు.