రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డు అమరవాదిలో ఉచిత పశు గర్భకోశ వైద్య శిబిరాన్ని జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా పశు వైద్యాధికారి తిరుపతి నేతృత్వంలో ముఖ్య అతిథులుగా ఐదవ వార్డు కౌన్సిలర్ జిలకర మహేష్ హాజరయ్యారు. పశువైద్యాధికారి తిరుపతి గోపాలమిత్ర రైతులతో కలిసి పశు వైద్య శిబిరంలో పాల్గొన్నారు.గర్భకోశ వ్యాధి చికిత్స, కృత్రిమ గర్భధారణ సహాయంతో పుట్టిన దూడలకు,పశువులకు నట్టల నివారణకు మందులను అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.