Gas Delivery Fraud Allegations in Nyalkal
గ్యాస్ డెలివరీలో మోసం: వినియోగదారుల ఆందోళన
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలో భారత్ గ్యాస్ సరఫరాపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్ ఇంటికి రాకపోయినా డెలివరీ అయినట్లు రికార్డుల్లో చూపిస్తున్నారని ఆరోపిస్తూ, స్థానికులు గ్యాస్ సరఫరా వాహనాన్ని రెండు మూడు గంటల పాటు నిలిపివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అద్నూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వినియోగదారులతో మాట్లాడి, గ్యాస్ సరఫరా వ్యవహారంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వాహనం సిలిండర్ల పంపిణీని కొనసాగించింది. గ్యాస్ సరఫరాలో పారదర్శకత పాటించాలని వినియోగదారులు కోరుతున్నారు.
