నర్సంపేట,నేటిధాత్రి :
బుధవారం విడుదలైన పోలీస్ ఫలితాలలో నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన నలుగురు యువతీ, యువకులు పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికైనట్లు గురిజాల ఉద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షులు గొలనకొండ వేణు, ప్రధాన కార్యదర్శి చుక్క రాజేందర్ గౌడ్ గురువారం మీడియాకు తెలిపారు.సివిల్ కానిస్టేబుల్ గా పొదిల శ్రావ్య, ఫైర్ కానిస్టేబుల్ గా జనగాం వినయ్, అల్లి అనిల్, టిఎస్ ఎస్ పి పోలీస్ కానిస్టేబుల్ గా బండారి సృజన్ ఎంపికై గురిజాల గ్రామ యువతకు ఆదర్శంగా నిలిచారని వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల గ్రామ ప్రజలు సైతం వారిని అభినందించారు.