నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యంతాగి వాహనాలు నడుపుతూ ఇటీవల పోలీసుల వాహన తనిఖీలో పట్టుబడిన నలుగురు వ్యక్తులకు కోర్టు
ఐదు రోజుల జైలు శిక్ష,1000 రూపాయలు జరిమాన విధించినట్లు నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నర్సంపేట పరిధిలో వాహనాలు తనకు నిర్వహిస్తుండగా
నర్సంపేట పట్టణం వల్లభ్ నగర్ కు చెందిన చింతకింది సురేందర్,ఇందిరానగర్ కు చెందిన మహమ్మద్ అహ్మద్,అలాగే సర్వాపురంకు చెందిన దారా అరుణ్, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఓటాయి గ్రామానికి చెందిన
మాలోత్ సంతోష్ లు మద్యంతాగి వాహనాలు నడుపుతూ పట్టు పడ్డారు.
వారిని నర్సంపేట కోర్టులో హాజరుపరచగా నర్సంపేట సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కొత్త లక్ష్మీనారాయణ ఈ నలుగురికి ఐదు రోజుల జైలు శిక్ష ఒక్కరికి 1000 రూపాయలు జరిమానా విధించినట్లు తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అలాగే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కొరకు ఆర్టీవో సిఫారస్సు చేస్తామని సీఐ హెచ్చరించారు.