జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లాఎన్నికల కోడ్ నేపథ్యంలో జైపూర్ మండల కేంద్రంలోని ఇందారం చెక్ పోస్ట్ సమీపంలో బుధవారం జైపూర్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా బొసెల్లి సురేష్ అనే వ్యక్తి దగ్గర ఎలాంటి రషీద్ పత్రాలు లేకుండా 4 లక్షల రూపాయలతో వెళ్తుండగా పోలీసులు పట్టుకొని డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. డబ్బులకు రషీద్ పత్రాలు లేకుండా ఉండడం తో 4 లక్షలను సీజ్ చేసి విచారణ కోసం
ఎఫ్ ఎస్ టి, టీం కి అప్పగించడం జరిగిందని స్థానిక ఎస్సై ఉపేందర్ రావ్ తెలిపారు.