భద్రాచలం నేటి ధాత్రి
ఈనెల 21 నుండి 25 వరకు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన గాలి రామ్మోహన్రావు అనే 72 సంవత్సరాల క్రీడాకారుడు 4 బంగారు పతకాలు సాధించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బెంచ్ ప్రెస్ పోటీలలో 105 కేజీల విభాగంలో 80 కేజీల బరువెత్తి బంగారు పతకం సాధించారు.,స్క్యాట్స్ 105 కేజీల విభాగంలో 100 కేజీ ల బరువెత్తి బంగారు పతకం సాధించారు. డెడ్ లిఫ్ట్ 105 కేజీలవిభాగంలో 130 కేజీల బరువెత్తి బంగారు పతకం సాధించారు. అంతేకాకుండా పవర్ లిఫ్టింగ్ అంటే( బెంచ్ ప్రెస్,, స్క్యాట్, డెడ్ లిప్ట్ ) ఈ మూడు కలిపితే పవర్ లిఫ్టింగ్ దీనిలో కూడా టోటల్ గా 310 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం సాధించడం జరిగింది. గతంలో కూడా గాలి రామ్మోహన్రావు ఎన్నో జాతీయ స్థాయి పోటీలలో బంగారు పథకాలు సాధించడం జరిగింది.అంతేకాకుండా పోయిన సంవత్సరం విజయనగరం రాజాంలో జరిగిన పవర్ లిప్టింగ్ పోటీలలో నేషనల్ రికార్డును తిరగ రాయడం జరిగింది. అప్పుడు ఆయన 70 కేజీలు చేసి రికార్డు తిరగరాయగా మళ్లీ ఆయన 70 కేజీల రికార్డును ఇప్పుడు 80 కేజీలు చేసి మళ్లీ కొత్త రికార్డును తిరగరాశారు. ఈ సందర్భంగా గాలి రామ్మోహన్ రావు మాట్లాడుతూఈ విజయం భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జివి రామిరెడ్డి ఇచ్చిన కటోర శిక్షణ వలనే సాధ్యమైందని తెలిపారు. గెలుపొందిన గాలి రామ్మోహన్రావును పవర్ లిఫ్టింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లేష్ , పట్టణంలోని క్రీడా సంఘాలు, పలువురు రాజకీయ నాయకులు, గ్రీన్ భద్రాద్రి అసోసియేషన్ సభ్యులు, జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు నేషనల్ పవర్ లిఫ్టర్ మహంతి వెంకటకృష్ణాజి , పట్టణ సంఘ సేవకులు గాదె మాధవరెడ్డి, మరియు సిటీ స్టైల్ జిమ్ సభ్యులు అభినందించడం జరిగింది.