
MLA GSR
వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో పర్యటించారు. రూ.52 లక్షలతో వివిధ గ్రామాలల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ధర్మారావుపేట గ్రామంలో ఎమ్మెల్యే యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో గ్రామంలోని శివాలయం ప్రహరీ గోడ నిర్మాణ పనులు పూర్తి చేయగా, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం బసవరాజుపల్లి గ్రామంలో యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు, రూ.12 లక్షలతో నూతన అంగన్వాడి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. గొల్లపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో పంచాయతీరాజ్ రోడ్డు నుండి పోచమ్మ ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. భూపాలపల్లి నియోజకవర్గంలో అన్ని గ్రామాల సమగ్రాభివృద్దే తన ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసి, రాష్ట్రంలోనే భూపాలపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే వెంట పలువురు అధికారులు, ఎంపీడీవో ఎల్ భాస్కర్ మండల అధ్యక్షుడు జిల్లా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ఎంపీటీసీ భవిత సుధాకర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కట్ల మల్లయ్య భాస్కరరావు చింతకుంట్ల శ్రీను పైసా మొగిలి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.