₹20 Lakh Development Works Launched
చానిగెపల్లిలో ₹20 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ని న్యాల్కల్ మండలం, చనిగెపల్లి గ్రామంలో సుమారు ₹20 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గ్రామ సర్పంచ్ సుధాకర్ నాయకత్వంలో ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో రోడ్లు, మురుగునీటి పారుదల వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ పనులు కొనసాగుతాయని సర్పంచ్ తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత గ్రామంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు సౌకర్యం కలుగుతుందని, ఇది గ్రామాభివృద్ధికి కీలక ముందడుగు అని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఎంపీపీ సురేష్ కుమార్ షెట్కార్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
