పలు గ్రామాల్లోఅభివృద్ధి పనులకు శంకుస్థాపన.

foundation stone

పలు గ్రామాల్లోఅభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

గ్రామాలభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది

ప్రగతిసింగారం గ్రామ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

కండువా కప్పి ఆహ్వానిం చిన ఎమ్మెల్యే జీఎస్సార్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలో వివిధ గ్రామాలలో భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు పర్యటిం చారు. ఆయా గ్రామాలల్లో సుమారు రూ.7.74 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముం దుగా కొత్తగట్టుసింగారం గ్రామంలో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాందా రిపేట లో సీసీరోడ్లు, శాయం పేట మహాత్మాగాంధీ జ్యోతిభా పూలే పాఠశాలలో సీసీ రోడ్డు, శాయంపేట నాగసముద్రం నుండి పత్తిపాక వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పత్తిపాక, నేరేడుపల్లి, కాట్రపల్లి, గంగిరేణిగూడెం, వసంతా పూర్, కొప్పుల, జోగంపల్లి, పెద్దకోడెపాక, మైలారం గ్రామాల్లోని ఎస్సీ కాలనీలల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకు స్థాపన చేశారు. అదేవిధంగా, వసంతాపూర్ నుండి కొత్త పల్లిగోరి మండల కేంద్రం వరకు బీటీ రోడ్డు రెన్యువల్, పెద్దకోడెపాక డంపింగ్ యార్డు నుండి మూడువాగుల కట్ట వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాలు, పంచాయితీలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ప్రజల ప్రతీ అవసరాన్ని తీర్చడమే ద్వేయంగా ముందుకెళ్తున్నా మని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందించేలా చూస్తా నని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్రతి నిధి ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తుందని తెలి పారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అనేక వినూ త్న కార్యక్రమాలు చేప‌డుతోం దన్నారు. ఇందిరమ్మ రాజ్యం, ప్ర‌జా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత‌ బస్సు ప్ర‌యాణాన్ని క‌ల్పించిందని తెలిపారు. ఉచిత ప్ర‌యాణ‌మే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్ర‌జా ప్ర‌భుత్వం చేప‌ట్టిన విజ‌య మని అన్నారు. ప్రతీ మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్ర‌తి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచా లనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. సదరు గుత్తేదా రులు నాణ్యతతో కూడిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే అన్నారు.

Foundation stone
Foundation stone

రూ.5,96,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే..

శాయంపేట మండలంలో వివిధ గ్రామాల్లో అభివృద్ది పనులకు శంకుస్థాపనల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదా రులకు అందజేశారు. మొత్తం 20 మంది సీఎం రిలీఫ్ లబ్దిదారులకు రూ.5,96, 000/- విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూరాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. లక్షలు ఖర్చు చేసి ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా నిలుస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రగతి సింగారం గ్రామ బీఆర్ఎస్ నేతలు

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు మండలంలోని ప్రగతిసింగారం గ్రామం నుండి 20 మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణరావు గ్రామ కూడలిలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు వీరే పిట్టల రఘుపతి, బళ్ల సంతోష్, చిలుకల తిరుపతి, చిలుకల సతీష్, చిలుకల రవి, దైనంపల్లి ప్రకాష్ లతో పాటు మరో ఇరవై మంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!