
Minister Konda Surekha
22వ డివిజన్లో కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన..
నేటిధాత్రి, పోచంమైదాన్.
వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో 22వ డివిజన్ ప్రజల అభ్యర్థన మేరకు స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి డివిజన్ ప్రజల సౌకర్యార్ధం, వారి సమస్యను కొన్ని సంవత్సరాల నుండి ఫంక్షన్స్ కు ఇతర కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే పేద మధ్యతరగతి ప్రజలు బాధపడుతున్న పరిస్థితిని గుర్తించి, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన మంత్రి కమ్యూనిటీ హాల్ కు 50 లక్షల నిధులతో నిర్మాణం చేయించాలని కోరారు.
కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన మంత్రి కొండా సురేఖ.

శుక్రవారం సాయంత్రం నగర మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి లు విచ్చేసి కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. నగర మేయర్ సైతం తనవంతు నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, డివిజన్ నాయకులు కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.