
"Inauguration of New Tribal Hostels at Satavahana University, Karimnagar"
నూతన గిరిజన బాలుర, బాలికల వసతి గృహాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీలో ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న నూతన గిరిజన బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణ పనులకు గురువారం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు. ఈసందర్భంగా వెలిచాల రాజేందర్రావు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని, గత బిఆర్ఎస్ పాలకుల హాయంలో శాతవాహన యూనివర్సిటీ ఎలాంటి అభివృద్ధికి నోచుకో లేదని, ఇప్పుడు ప్రజా పాలన ప్రభుత్వంలో హుస్నాబాద్ కి ఇంజనీరింగ్ కళాశాల, కరీంనగర్ కి లా కళాశాల మంజూరు అయిందని రాజేందర్రావు పేర్కొన్నారు.
విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, వీసీ ఉమేష్ కుమార్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, నేతలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.