పెద్ద చెరువు మరమ్మత్తులకు 16,60,000లు మంజూరు
మంచినీటి సరఫరా పనులు ప్రారంభించిన కట్కూరి దేవేందర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ సర్పంచ్ రఘునారాయణ,పంచాయతీ కార్యదర్శి శైలజ
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో మంచినీటి సరఫరా నీటి ఎద్దడి నివారణకు సత్వరం మైనర్ రిపేర్లు చేయడానికి ఎమ్మెల్యే నిధుల నుండి ఆర్డబ్ల్యూఎస్ స్కీం కింద రెండు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది.పనులను శనివారం రోజున మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,మల్లక్కపేట మాజీ సర్పంచ్,అల్లం రఘు నారాయణ,పంచాయతీ కార్యదర్శి ఓరుగంటి శైలజ ప్రారంభించారు.
16,60,000 లతో పెద్ద చెరువుకట్ట మరమ్మత్తుల పనులు ప్రారంభం
గ్రామంలోని పెద్ద చెరువు వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువు కట్ట తెగిపోవడం జరిగింది.కావున చెరువు కట్ట మరమ్మత్తు కొరకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో16,60,000 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది.కట్ట మారమ్మత్తు పనులను పరకాల మాజీ సింగిల్ విండో చైర్మన్ సింగిల్ విండో డైరెక్టర్ కట్కూరి దేవేందర్ రెడ్డి,మాజీ సర్పంచ్ అల్లం జయ రఘునారాయణ,పంచాయతీ కార్యదర్శి పోరుగంటి శైలజ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానురి రాజు కంటెస్టెడ్ ఎంపీటీసీ అంబిరు మహేందర్,మండల యూత్ అధ్యక్షులు దొమ్మటి కృష్ణకాంత్,మాజీ ఉపసర్పంచ్ లడే భాస్కరరావు,మాజీ ఉపసర్పంచ్ సంగెం బ్రహ్మచారి,గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు దొమ్మటి చార్లెస్,సీనియర్ నాయకులు తిక్క పాల్,గంగోజుల వెంకటేశ్వర్లు,భయ్యా మధుకర్,దొమ్మటి మల్లయ్య,దొమ్మటి శంకరయ్య, దుమల రాజేందర్,బొల్లికొండ రమేష్,డెంగు శంకర్రావు,చెన్న నగేష్,యూత్ నాయకులు అల్లం కార్తీక్,బండి రవి,ఓనపాకల సాంబయ్య, ఓనపాకల చిలుకయ్య,పైడిపాల బాలకృష్ణ,దొమ్మటి మధు,గంగోజుల రాకేష్,తిక్క రామకృష్ణ,కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.