ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం మండలంలోని పలు గ్రామాలల్లో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.గోవిందాపూర్ గ్రామ శివారులో ఉన్న కస్తూర్భా బాలికల విద్యాలయంలో రూ.13 లక్షలతో సివిల్ వర్క్స్, కరెంట్ వర్క్స్, ఆర్ ఓవాటర్ ప్లాంట్ ఏర్పాటు కొరకు శంకుస్థాపన చేశారు.కొత్తగట్టు సింగారంలో రూ.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.మాందారిపేట గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గట్లకానిపర్తి గ్రామంలో శివాలయం చుట్టూ రూ.10 లక్షలతో వ్యయంతో నిర్మించనున్న శివాలయం చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం మరియు కళ్యాణ మండపం నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు.అనంతరం ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులతో పాటు అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తానని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే వెంట పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఉన్నారు.