ధాన్యం నిలువల గోదాముల నిర్మాణానికి శంకుస్థాపన.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మొగుళ్ళపల్లి నేటి దాత్రి.
జయశంకర్ జిల్లా భూపాలపల్లి మొగుళ్లపల్లి మండలంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 13 కోట్ల రూపాయలతో పదివేల టన్నుల నిలువ గోదాముల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వేర్ హౌస్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.

13 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న కొత్త దాన్యం గోదాం (గిడ్డంగి) అభివృద్ధి పనులకు శంకుస్థాపన రాష్ట్రంలో రైతుల పండించిన ధాన్యానికి సురక్షమైన నిలువ సౌకర్యాలు కల్పించడం గోదావరి పంట నష్టాన్ని తగ్గించడం జరుగుతుందన్నారు స్థానిక ఎమ్మెల్యే ను పొగడ్తలతో ముచ్చెత్తినమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఒక గోడౌన్ శంకుస్థాపనకు పిలిచి నియోజకవర్గానికి మరిన్ని గోడౌన్లు సొసైటీలు మరి నీ అభివృద్ధి పనులు కావాలని అడిగారు భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి గడపను టచ్ చేసిన రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యే గాండ్ర సత్తన్న అని నాకు పరిచయం అయినప్పటి నుండి చూస్తున్న ఎన్నికల్లో ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతి గడప గడపకు తిరిగే వ్యక్తి ఎమ్మెల్యే సత్యన్నా రాజకీయాలంటే ప్రజల కొరకు కష్టపడి పని చేయాలని తపన ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే పొగిడారు
