Former ZPTC Kodi Anthayya Consoles Bereaved Families
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలు మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య. గత రెండు రోజుల క్రితం వైద్యం వికటించి మృతి చెందిన మహమ్మద్ అమిద్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి మృతుడి కుటుంబానికి మూడు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేయడంతో పాటు. తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బుస రాజేశం. ఒగ్గు కుంటయ్య మరియు రాళ్లపేట గ్రామానికి చెందిన గౌరీ శంకర్ మృతిచెందగా వారి కుటుంబాలను పరామర్శించి మనం ధైర్యం కల్పించి. వారికి భరోసాను.ఇచ్చారు అలాగే నిరుపేద కుటుంబానికి చెందిన అమీద్.కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా.ఆదుకోవాలని. ప్రభుత్వానికి తెలియజేస్తూ నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని తదుపరి ఇట్టి విషయాలపై సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు దృష్టికి తీసుకువెళ్లి వాళ్ళ కుటుంబాలకు అన్ని రకాల సహాయ సహకారాలు చేకూర్చే దిశగా ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా కేటీ రామారావు కి తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. పరామర్శించిన వారిలో. మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య. తంగళ్ళపల్లి ఉపసర్పంచ్ ఆసాని శ్రీకాంత్ రెడ్డి. వార్డు మెంబర్ తాటికొండ చందు. సాయి. మైనార్టీ నాయకులు. చనిపోయిన బాధిత కుటుంబాల వారు తదితరులు పాల్గొన్నారు
