
Congress
చేవెళ్ల నియోజకవర్గంలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలికి ఘన నివాళులు
శంకర్ పల్లి, నేటిధాత్రి:
రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకట్ స్వామి సతీమణి, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు మరియు మాజీ ఎంపీపీ శ్రీమతి పడాల యాదమ్మ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామంలో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించబడిన సందర్భంగా, పలువురు నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ స్వర్గీయ యాదమ్మ భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం, ఆయన పడాల వెంకట్ స్వామి మరియు కుమారుడు ప్రభాకర్ ని పరామర్శిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మొయినాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మానయ్య, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, చేవెళ్ల యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పెంట రెడ్డి, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణ రెడ్డి, బాకారం మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఫిషర్ మెన్ సంఘం అధ్యక్షుడు బిక్షపతి, తోల్కట్ట సత్యనారాయణ, బలవంత రెడ్డి, ముడిమ్యాల గ్రామ ఎంపీటీసీ శ్రీనివాస్, వివిధ గ్రామాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.