ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీఎస్ఐడిసి మాజీ చైర్మన్ మహ్మద్ తన్వీర్.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రంలో ఆలంగిరి జామియా మసీదులో ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని టీఎస్ఐడిసి మాజీ చైర్మన్ మహ్మద్ తన్వీర్ అన్నారు.ఈ మేరకు శుక్రవారం ఝరాసంగం గ్రామ ఆలంగిరి జామియా మసీద్ లో మహమ్మద్ యూనుస్ ఆధ్వర్యంలో ఝరాసంగం లోని మసీదు కార్యాలయంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఎస్ఐడిసి మాజీ చైర్మన్ మహ్మద్ తన్వీర్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండే ముస్లీం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం.

అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో బషీర్ సాబ్ మొహమ్మద్ హమీద్ మొహమ్మద్ ఇస్మాయిల్ షేక్ సజావుద్దీన్ సాదాత్ హుస్సేన్ అబ్రామ్ షకీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందుకు విచ్చేసిన అతిథులు, గ్రామస్తులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు.