
చనిపోయిన కుటుంబానికి అండగా నిలిచిన మాజీ ఉపసర్పంచ్….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ని. గ్రామానికి చెందిన బాష్మియా ఇటీవల గుత్తి తెలియని వాహనం ఢీకొనడంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందడంతో. వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యంచెప్పి. తమ వంతుగా 50 కేజీల బియ్యం వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన. తంగళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ పెద్దూరు తిరుపతి. ఈ సందర్భంగా. మాట్లాడుతూ వారి కుటుంబంలోని పెద్దదిక్కును కోల్పోవడం చాలా బాధాకరమని. వారి కుటుంబం చాలా పేదరికంతో ఉందని త్వరలో సంబంధిత అధికారుల నాయకులతో మాట్లాడి వారికి అర్హతలు ఉన్న దాని ప్రకారం అన్ని సదుపాయాలు అందించే విధంగా. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారికి తగిన న్యాయం జరిగేలా. చేయిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్. నేరెళ్ల నర్సింగం గౌడ్. కాంగ్రెస్ నాయకులు హమీద్. రెడ్డి పరశురాములు. ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.