
Congress Party
బడుగు బలహీన వర్గాల నాయకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు బడుగు బలహీన వర్గాల నాయకుడు నవభారత నిర్మాణ సృష్టికర్త దేశానికి దిశా నిర్దేశం చూపిన మార్గదర్శకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి కొమురయ్య అన్నారు బుధవారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికిపూలమాలవేసి నివాళి అర్పించారు వారు మాట్లాడుతూ దేశాన్ని టెక్నాలజీ రంగం వైపు తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు భారతదేశ ప్రధాన మంత్రిగా ప్రజలకు చేసిన సేవలు అభివృద్ధి గురించి గుర్తు చేశారు దేశానికి సాంకేతికతను తీసుకోవచ్చింది సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ అని అన్నారు అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశం నీ నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుందని గుర్తు చేశారు దేశంలో బీదరికాన్ని పారదోలి సమ సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేమని కొనియాడాడు